West Godavari District: టీడీపీలోకి పశ్చిమగోదావరి వైసీపీ నేత ఘంటా మురళి

  • ఒకప్పుడు కాంగ్రెస్‌ వాది
  • ఆ తర్వాత వైసీపీలో చేరి కీలకపాత్ర
  • ఎన్నికల వేళ పసుపు జెండా వైపు

పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి సైకలెక్కాలని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా ఓ వెలుగు వెలిగిన మురళి రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ ప్రాభవం కోల్పోవడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

వైసీపీలో ముఖ్యనేతగా మారి కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీ నేత మాగంటి బాబుతో మురళి సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చించిన అనంతరం టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. త్వరలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలిసి ఆయన సమక్షంలో పసుపుకండువా కప్పుకోనున్నారు. మురళీ పార్టీ మారడంతో జిల్లాలోని చింతలపూడి రాజకీయం రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారు. 

West Godavari District
chithalapudi
ghanta murali
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News