Kareena Kapoor: సెలబ్రిటీలం అయితే మాత్రం... మాకు ఫీలింగ్స్ ఉండవా?: కరీనా కపూర్

  • పొట్టి దుస్తులతో ఫోటోలు పెడుతున్న కరీనా
  • తైమూర్ ను కన్న తరువాత 'ఆంటీ' అంటున్న నెటిజన్లు
  • తమ ఫీలింగ్స్ ను పట్టించుకోవడం లేదని వాపోయిన కరీనా

నాలుగు పదుల వయసులోనూ మతి పోగొట్టేలా దుస్తులను ధరించి, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ నెటజన్ల నుంచి ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న కరీనా కపూర్, అర్బాజ్ ఖాన్ వెబ్ చాట్ షోలో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తైమూర్ ను కన్న తరువాత ఆమెను 'ఆంటీ' అని సంబోధించడం ప్రారంభించిన ఎంతో మంది, ఆమె తన వయసుకు తగ్గట్టు నడుచుకోవడం లేదని, ఇంత ఎక్స్ పోజింగ్ దుస్తులు ఎందుకని అడగడం ప్రశ్నించారు.

దీనిపై స్పందించిన ఆమె, సెలబ్రిటీల ఫీలింగ్స్ ను ఎవరూ పట్టించుకోరని ఆరోపించింది. తమకూ భావాలుంటాయని, ఒకప్పుడు నటీనటులకు ఎంతో గౌరవం దక్కేదని, ఇప్పుడు అలా జరగడం లేదని వాపోయింది. సెలబ్రిటీల ఫీలింగ్స్ గురించి కూడా అవగాహన పెంచుకోవాలని సూచించింది. కాగా, ప్రస్తుతం కరీనా, 'గుడ్‌న్యూస్‌' చిత్రంలో నటిస్తోందన్న సంగతి తెలిసిందే.

Kareena Kapoor
Celebrities
Taimur
Aunty
  • Loading...

More Telugu News