Rafale deal: ఫైళ్లనే రక్షించలేని వాడు.. దేశాన్నేం రక్షిస్తాడు?: మోదీపై స్టాలిన్ ఫైర్

  • రాఫెల్ డీల్‌కు సంబంధించి కీలక పత్రాలు చోరీ 
  • విరుచుకుపడిన డీఎంకే చీఫ్
  • అబ్బే అదేం లేదంటూ మాట మార్చిన ప్రభుత్వం

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై డీఎంకే చీఫ్ స్టాలిన్ విచురుకుపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ‘రాఫెల్’ ఫైళ్లు మాయం అయ్యాయన్న ప్రభుత్వ వ్యాఖ్యలపై స్టాలిన్ మాట్లాడుతూ.. ఫైళ్లనే రక్షించలేని వ్యక్తి దేశాన్ని ఇంకేం రక్షిస్తారని ప్రశ్నించారు. ‘‘నా ప్రశ్న ఏంటంటే.. అత్యంత రహస్యమైన డాక్యుమెంట్లను రక్షించలేని వ్యక్తి దేశాన్ని ఎలా రక్షిస్తారన్నదే. ఇందుకోసమే బీజేపీకి వ్యతిరేకంగా కొత్త కూటమి ఏర్పడింది’’ అని స్టాలిన్ చెప్పుకొచ్చారు.

రాఫెల్ డీల్‌లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న వేళ.. ఈ డీల్‌కు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురయ్యాయంటూ స్వయంగా ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు తెలపడంపై దుమారం చెలరేగింది. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన ప్రభుత్వం వెంటనే మాట మార్చింది. రాఫెల్ డీల్‌కు సంబంధించిన కీలక పత్రాలు చోరీకి గురికాలేదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News