Pakistan: పాక్ తీరు మారలేదు.. బాలాకోట్ తరహా దాడి మరోటి తప్పేలా లేదు: భారత్ హెచ్చరిక

  • పాక్‌లో ఇంకా 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు
  • అందులో 9 మసూద్ అజర్‌వే
  • ఉగ్రవాదం అణచివేతపై నమ్మదగిన చర్యలు తీసుకోవాల్సిందే

పాక్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసిన తర్వాత కూడా పాకిస్థాన్‌లో ఇసుమంతైనా మార్పు రాలేదు. ఇప్పటికీ ఇంకా 22 ఉగ్రవాద శిక్షణ శిబిరాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో తొమ్మిది మసూద్ అజర్‌ జైషే మహ్మద్ సంస్థకు చెందినవని భారత అధికారి ఒకరు తెలిపారు. ఆ శిబిరాలపై పాక్ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

భారత సరిహద్దుకు ఆవల ఉన్న ఉగ్రశిబిరాలపై పాక్ చర్యలు తీసుకుంటే సరేసరి అని, లేదంటే బాలాకోట్ పై జరిపిన వాయుదాడుల్లాంటివి మరోమారు తప్పవని పాక్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్రబిందువుగా మారిందని, ఉగ్రవాద సంస్థలపై ప్రపంచం నమ్మదగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన ఆయన, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ భూభాగంలో నడుస్తున్న ఉగ్ర శిక్షణ కేంద్రాల పని పట్టాలని, లేదంటే బాలాకోట్ తరహా మరో దాడి తప్పదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News