Koushal: తెలుగుదేశం పార్టీలోకి బిగ్ బాస్ విజేత కౌశల్!

  • ఉండవల్లిలోని ప్రజావేదికకు వచ్చిన కౌశల్
  • చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లిన మంత్రి గంటా
  • పార్టీలో చేరేందుకు కౌశల్ సంసిద్ధత

బిగ్ బాస్ విజేత, టాలీవుడ్ నటుడు కౌశల్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైపోయింది. నిన్న రాత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ప్రజావేదికకు వచ్చిన కౌశల్, ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కౌశల్ ను దగ్గరుండి తీసుకొచ్చిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇద్దరినీ సమావేశపరిచారు.

టీడీపీతో కలసి పని చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన కౌశల్, రానున్న ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు కూడా అంగీకరించారు. త్వరలోనే తన పర్యటన, ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ప్రకటిస్తానని కౌశల్ చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, తెలుగుదేశం పార్టీ తరఫున కౌశల్ ఏదైనా నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడ లేదు. గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులతో ట్రోలింగ్ ను ఎదుర్కొంటున్న కౌశల్, ఇప్పుడు టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం గమనార్హం.

Koushal
Chandrababu
Biggboss
Telugudesam
Ganta Srinivasa Rao
  • Loading...

More Telugu News