YSRCP: ‘యాత్ర’ సినిమాకు జగన్ శుక్రవారం వెళ్లగలడా?: వర్ల రామయ్య సెటైర్లు

  • రాష్ట్రంలోని పౌరులందరి లాంటి వ్యక్తి కాదు జగన్ 
  • ప్రతి శుక్రవారం సాధారణ పౌరుడెక్కడైనా ఉండగలడు 
  • జగన్ మాత్రం కోర్టులోనే ఉండాలి.. అది ఆయన ప్రత్యేకత

వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెంగళూరులో, హైదరాబాద్ లో, అమరావతిలో జగన్ ఇళ్లు ఉన్నాయని, అవి ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో నూతనంగా నిర్మించిన ఈ ఇంటిని జగన్ కొన్నాడా? కొట్టేశాడా? జవాబు చెప్పాలని అన్నారు.

ఒకప్పుడు ఏమీ లేని జగన్ తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని లక్ష కోట్లు సంపాదించాడని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యేప్పటికీ జగనేమీ ఆస్తిపరుడు కాదని విమర్శించారు. మన దేశంలో, రాష్ట్రంలోని పౌరులందరి లాంటి వ్యక్తి జగన్ కాదని, ఆయనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయని.. ప్రతి శుక్రవారం సాధారణ పౌరుడు ఎక్కడైనా ఉండగలుగుతాడు కానీ, జగన్ ఉండలేడని, ఎందుకంటే, కోర్టుకు ఆయన హాజరవ్వాలంటూ ఎద్దేవా చేశారు.

‘యాత్ర’ సినిమా బాగుందని చూడాలనిపిస్తే శుక్రవారం రోజున జగన్ వెళ్లగలడా? లేకపోతే ‘ఎన్టీఆర్’ బయోపిక్ చూసేందుకో జగన్ వెళ్లగలడా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

YSRCP
jagan
Telugudesam
varla ramaiah
  • Loading...

More Telugu News