railway minister: విశాఖ రైల్వేజోన్ ను 11 నెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టాం: మంత్రి పీయూష్ గోయల్

  • ఇప్పటికే ఓఎస్ డీని నియమించాం
  • జోన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు సమయం
  • ఈ ప్రక్రియ మొత్తం మూడేళ్లలో పూర్తి చేసేలా కృషి  

విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గత నెల 27న ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సౌత్ కోస్ట్ రైల్వే’గా నామకరణం చేసిన ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్, రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ యాదవ్ వెల్లడించారు.

ఢిల్లీలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, విశాఖ రైల్వేజోన్ ను పదకొండు నెలల్లో ప్రారంభించేలా చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. ఈ జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఓఎస్ డీని నియమించామని, జోన్ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు సమయం పడుతుందని, ఈ ప్రక్రియ మొత్తం మూడేళ్లలో పూర్తి చేసేందుకు క‌ృషి చేస్తున్నట్టు చెప్పారు.

railway minister
piyush goel
vishaka railway zone
  • Loading...

More Telugu News