Chandrababu: విశాఖ అంటే లోకేశ్‌కు ఎందుకంత ప్రేమ? మరింత దోచుకుందామనా?: అవంతి శ్రీనివాస్

  • ఐదేళ్లుగా మహిళలు గుర్తుకు రాలేదా?
  • విశాఖలో పోటీ చేయడం ఎందుకు?
  • వెనుబడిన నియోజకవర్గంలో పోటీ చెయ్యొచ్చు కదా

వైసీపీ కీలక నేత, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పసుపు - కుంకుమ చెక్కులు అందజేస్తున్న చంద్రబాబుకు.. గత ఐదేళ్లుగా మహిళలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు.
 
 అభివృద్ధి చెందిన విశాఖలో నారా లోకేశ్ పోటీ చేయడం ఎందుకని.. అదే ఏదైనా వెనుకబడిన నియోజకవర్గంలో పోటీ చేసి దానిని అభివృద్ధి చెయ్యొచ్చు కదా? అని సూచించారు .అసలు లోకేశ్‌కు విశాఖ అంటేనే ఎందుకంత ప్రేమ?... విశాఖను మరింత దోచుకుందామనా? అంటూ అవంతి ఎద్దేవా చేశారు. కాగా, విశాఖ జిల్లా భీమిలి నుంచి లోకేశ్ పోటీ చేస్తారంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

Chandrababu
Nara Lokesh
Avanthi Srinivas
Visakha
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News