Andhra Pradesh: జగన్ తో చేతులు కలిపితే కేసీఆర్ కే ఇబ్బంది: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

  • జగన్ పై అనేక కేసులు ఉన్నాయి
  • కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోవాలి
  • డేటా చోరీ విషయమై బీజేపీ నేతల అబద్ధాలు తగదు

డేటా చోరీ వివాదంలో టీఆర్ఎస్ ముమ్మాటికీ కుట్ర చేస్తోందని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనేక కేసులున్న జగన్ తో చేతులు కలిపితే కేసీఆర్ కే ఇబ్బంది అని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా బీజేపీపైనా ఆయన దుమ్మెత్తి పోశారు. డేటా చోరీ విషయమై బీజేపీ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రతి రాజకీయ పార్టీకి యాప్ ఉంటుందని, అలాగే, టీడీపీకి కూడా ఉందని, సేవామిత్ర యాప్ లో తమ పార్టీ డేటా ఉందని స్పష్టం చేశారు. అయినా, ప్రజల సమాచారం సేకరించకూడదని ఎక్కడైనా ఉందా? పబ్లిక్ డేటాను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం అమలు చేసే అనేక పథకాల సమాచారం ఆన్ లైన్ లో లేదా? 'సేవామిత్ర’లోని డేటా చూపించి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Andhra Pradesh
Telangana
kcr
KTR
Jagan
kutumba rao
Telugudesam
bjp
namo app
seva mitra
  • Loading...

More Telugu News