Sudha Murthy: నాటి పౌరాణిక చిత్రాల నుంచి నిన్నటి 'రంగస్థలం' వరకూ చూశాను: ఇన్ఫోసిస్ సుధామూర్తి

  • పాటలు పాడి వినిపించిన సుధామూర్తి
  • ఎన్టీఆర్‌లోనే కృష్ణుడిని చూశా
  • చెర్రీ నటనకు ప్రశంసలు

ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తులు వాళ్లంతట వాళ్లు వెల్లడిస్తే కానీ తెలియటం కష్టం. అలాగే ఇన్పోసిన్ నారాయణమూర్తి అర్థాంగి సుధామూర్తి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తనకు తెలుగు సినిమాల పట్ల ఉన్న ఆసక్తిని వెల్లడించడమే కాకుండా.. కొన్ని సినిమాల్లోని పాటలను పాడి వినిపించి ఆశ్చర్యపరిచారు.

ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రంలోని ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము’ అనే పాటను.. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాలోని ‘కాటుక కళ్లను చూస్తే.. పోతుందే మతి పోతుందే..’ను పాడి వినిపించారు. నాటి పౌరాణిక చిత్రాల నుంచి ఇటీవల వచ్చిన ‘రంగస్థలం’ వరకూ దాదాపు అన్ని సినిమాలనూ చూసినట్టు సూధామూర్తి వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలను చూశానని... కృష్ణుడిని ఆయనలోనే చూశానని తెలిపారు. ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నటనను ప్రశంసించారు. అన్నమయ్య వంటి భక్తిరస ప్రధాన చిత్రాలంటే తనకు మక్కువ ఎక్కువని.. అలాగే అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ‘మనం’ కూడా చూసినట్టు ఆమె వెల్లడించారు.

Sudha Murthy
Prabhas
Nageswara Rao
NTR
Rangastalam
Ram charan
Annamayya
  • Loading...

More Telugu News