sekhar kammula: హీరో హీరోయిన్లను శేఖర్ కమ్ముల ఇప్పట్లో చూపించరట

  • ప్రేమకథల స్పెషలిస్ట్ గా శేఖర్ కమ్ముల
  • సహజత్వంతో పాత్రల చిత్రణ
  •  కొత్తవారితో తాజా చిత్రం

తెలుగు తెరకి అందమైన ప్రేమకథలను పరిచయం చేసిన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ప్రేమకథలకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడిస్తూ, సహజత్వంతో అన్నివర్గాల ప్రేక్షకులను థియేటర్స్ కి రప్పించడం ఆయన ప్రత్యేకత. అలాంటి శేఖర్ కమ్ముల ప్రస్తుతం మరో ప్రేమకథను తెరపైకి తీసుకొచ్చే పనిలో వున్నాడు. అంతా కొత్త వాళ్లతో ఆయన ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.

అయితే ఆ హీరో హీరోయిన్ల పోస్టర్స్ బయటికి రాకుండా .. వాళ్లకి సంబంధించిన సమాచారం లీక్ కాకుండా శేఖర్ కమ్ముల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. దాంతో ఈ సినిమాలో నాయకా నాయికలు ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగిపోతోంది. ప్రమోషన్స్ సమయంలో అయినా కొత్త హీరో హీరోయిన్లను మీడియా ముందుకు వదులుతారా? అనేది సందేహంగా మారింది. గతంలో గుణశేఖర్ 'వరుడు' సినిమా సమయంలో హీరోయిన్ ఎవరనేది ఇలాగే దాచి .. ఏకంగా తెరపైనే చూపించారనే సంగతి తెలిసిందే.

sekhar kammula
  • Loading...

More Telugu News