Andhra Pradesh: అశోక్ ను పట్టుకొచ్చి విచారిస్తే అన్ని విషయాలు బయటకువస్తాయి!: వైసీపీ నేత బుగ్గన

  • ఏపీని ఐదేళ్లలో చంద్రబాబు భ్రష్టు పట్టించారు
  • రెండు సిట్ లను హడావుడిగా ఎందుకు ఏర్పాటుచేశారు
  • టీడీపీ అధినేతపై విమర్శలు గుప్పించిన వైసీపీ నేత

గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు భ్రష్టు పట్టించారని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. ఫామ్-7 వ్యవహారంపై హడావుడిగా రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాల(సిట్)ను ఎందుకు నియమించారని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న నకిలీ ఓట్లను గుర్తించి ఫామ్-7 ద్వారా అప్ లోడ్ చేశామనీ, అందులో అభ్యంతరం ఏముందని నిలదీశారు. హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఐటీ గ్రిడ్స్ కేసును దారి మళ్లించేందుకే ఫామ్-7 విషయంలో 300కు పైగా కేసులను నమోదుచేశారని ఆరోపించారు. ఇక ఎన్నికల కమిషన్ బాధ్యతలను కూడా టీడీపీ తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. ఐటీ గ్రిడ్స్ అశోక్ ను పట్టుకొచ్చి విచారిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. సేవా మిత్ర యాప్ వ్యవహారంలో చంద్రబాబు నిండా మునిగారని ఎద్దేవా చేశారు.

Andhra Pradesh
Telangana
YSRCP
buggana
Chandrababu
  • Loading...

More Telugu News