harish rao: బావ హరీశ్ రావుకు సవాల్ విసిరిన కేటీఆర్

  • కరీంనగర్ ఎంపీ స్థానం కంటే మెదక్ లో ఎక్కువ మెజార్టీ సాధించండి
  • ఇదే మా సవాల్
  • కనీసం రెండు ఓట్లైనా ఎక్కువ తెచ్చుకుంటాం

ఈరోజు టీఆర్ఎస్ మెదక్ లోక్ సభ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బావాబావమరుదులకు ఏమీ కాలేదని... ఇద్దరం బాగున్నామని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ ఎంపీ స్థానం కంటే మెదక్ ఎంపీ స్థానంలో ఎక్కువ మెజర్టీటీ సాధించాలని... హరీశ్ కు ఇదే తన సవాల్ అని చెప్పారు. మెదక్ కంటే కనీసం రెండు ఓట్లైనా తాము ఎక్కువ తెచ్చుకుంటామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

harish rao
KTR
TRS
karimnagar
medak
  • Loading...

More Telugu News