chiranjeevi: 'సైరా' గురించి చిరంజీవిని ఇంటర్వ్యూ చేయనున్న చరణ్

- షూటింగు దశలో 'సైరా'
- కీలకమైన పాత్రలో అమితాబ్
- మొదలుకానున్న బిజినెస్ డీల్స్
మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు 'సైరా' సినిమాపైనే వుంది. ఈ సినిమాను గురించి .. అది సృష్టించబోయే సంచలనాలను గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను గురించి చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేయనున్నాడట. 'సైరా' సినిమా ప్రత్యేకత .. దాని విశిష్టత .. ఆయా పాత్రలను మలచిన విధానం .. లుక్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు .. కాస్ట్యూమ్స్ పై పెట్టిన శ్రద్ధ .. షూటింగ్ విశేషాలు .. అనుభవాలు .. బడ్జెట్ సంబంధమైన వివరాలు ఇలా అనేక విషయాలను గురించి చిరంజీవిని చరణ్ ఇంటర్వ్యూ చేస్తాడట.
