simbu: కన్నడ హిట్ మూవీ రీమేక్ లో శింబు

  • కెరియర్ పై దృష్టి పెట్టిన శింబు
  • వరుస సినిమాలకి సైన్ 
  • సెట్స్ పైకి వెళ్లనున్న రెండు సినిమాలు

కొన్ని కారణాల వలన ఆ మధ్య కెరియర్ పై దృష్టి పెట్టలేకపోయిన శింబు, అక్కడి స్టార్ హీరోల రేసులో వెనకబడిపోయాడు. ఈ విషయం ఆయన తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఇప్పుడు మళ్లీ శింబు తన కెరియర్ పై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తున్నాడు. వరుస సినిమాలను అంగీకరిస్తూ, ఒకదాని తరువాత ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'మానడు' సినిమా చేయనున్న ఆయన, కన్నడ మూవీ 'మఫ్టీ రీమేక్ లో చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. కన్నడలో 'మఫ్టీ'ని తెరకెక్కించిన 'నార్థన్' తమిళ సినిమాకి కూడా దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం 'ఆర్య'ను .. అథర్వ మురళిని సంప్రదిస్తున్నారట. ఇద్దరిలో ఒకరిని త్వరలో ఖరారు చేయనున్నట్టుగా తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News