Andhra Pradesh: అవినీతిపరులు అధికారంలోకి వచ్చారంటే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుంది!: మంత్రి ప్రత్తిపాటి హెచ్చరిక

  • స్త్రీశక్తిని నిరూపించుకునే ఛాన్స్ చంద్రబాబు ఇచ్చారు
  • మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు
  • గుంటూరులో మీడియాతో ఏపీ మంత్రి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘పసుపు-కుంకుమ’ పథకం కింద మహిళలకు రెండో విడత నగదును అందజేస్తున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీలో స్త్రీశక్తిని నిరూపించుకునే అవకాశాన్ని చంద్రబాబు కల్పించారని వ్యాఖ్యానించారు. మహిళల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏపీలో దొంగఓట్లను చేర్పించినవారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. అరాచకశక్తులు అధికారంలోకి రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవినీతిపరులు అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని వ్యాఖ్యానించారు.

Andhra Pradesh
Telugudesam
PRATTIPADI
PULLARAO
Guntur District
MEDIA
  • Loading...

More Telugu News