Telangana: టీఆర్ఎస్ లో చేరనున్న నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య!

  • ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ
  • నియోజకవర్గ సమస్యలు, రాజకీయాలపై చర్చ
  • ఇటీవల కాంగ్రెస్ ను వీడిన కాంతారావు, సక్కు

తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నుంచి గెలుపొందిన చిరుమర్తి లింగయ్య తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఈరోజు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, నియోజకవర్గంలోని సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించారు. కాగా, లింగయ్య త్వరలోనే టీఆర్ఎస్ లో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కులు ఇటీవల టీఆర్ఎస్ లో చేరుతామని ప్రకటించిన సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా టీఆర్ఎస్ వైపు మొగ్గడం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Telangana
Congress
TRS
nakirekal
mla
chirumarti lingayya
  • Loading...

More Telugu News