krishnam raju: కృష్ణంరాజు గారు ఎంత గంభీరంగా కనిపిస్తారో .. అంత సున్నితంగా అనిపిస్తారు: భార్య శ్యామలాదేవి

  • కృష్ణంరాజుగారికి స్త్రీలంటే గౌరవం
  •  ప్రభాస్ కి కూడా అదే పద్ధతి వచ్చింది
  •  అలా కృష్ణంరాజుగారు పెళ్లికి అంగీకరించారు

తెలుగు తెరపై రెబల్ స్టార్ గా కృష్ణంరాజు ఒక వెలుగు వెలిగారు. ఆయన శ్రీమతి శ్యామలాదేవి .. 'మహిళా దినోత్సవం' సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కృష్ణంరాజు గురించి ప్రస్తావించారు. "కృష్ణంరాజుగారితో మాట్లాడటానికి ఎవరైనా సరే చాలా భయపడతారు. గంభీరమైన ఆయన రూపం .. ఆయన వాయిస్ అందుకు కారణం. అయితే ఆయనతో మాట్లాడిన వాళ్లు ఆయన అభిమానులు కాకుండా తిరిగివెళ్లరు. అంతటి అభిమానం చూపుతూ మాట్లాడతారాయన.

ఆయన ఎంతటి సున్నిత మనస్కుడు అనేది ఆయనతో మాట్లాడిన తరువాతనే అర్థమవుతుంది. స్త్రీలంటే ఆయనకి  ఎంతో గౌరవం .. అదే పద్ధతి ప్రభాస్ కి కూడా వచ్చింది. పెళ్లికి ముందు నన్ను చూడటానికి కృష్ణంరాజుగారు తన కజిన్ ను పంపించారు. ఆ సమయంలో నేను చిన్న పిల్లలతో ఆడుకుంటున్నాను. ఆయన వెళ్లి అదే విషయం చెప్పారట. 'చిన్నపిల్లలతో ఆడుకునేవారి మనస్తత్వం మంచిదై ఉంటుంది .. పెళ్లికి ఓకే చెప్పండి' అని కృష్ణంరాజుగారు అన్నారట" అంటూ చెప్పుకొచ్చారు.

krishnam raju
shyamala devi
  • Loading...

More Telugu News