Maharashtra: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్లతో పేల్చి, కూల్చేసిన అధికారులు!

- అలీబాగ్ లో రూ.100 కోట్లతో నిర్మాణం
- రూపాన్యాగా నామకరణం
- అక్రమంగా నిర్మించడంతోనే కూల్చేశామంటున్న అధికారులు
ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి అధికారులు షాక్ ఇచ్చారు. మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లా అలీబాగ్ లో నీరవ్ ఇష్టపడి కట్టుకున్న రూ.100 కోట్ల విలువైన బంగ్లాను అధికారులు డైనమైట్లతో పేల్చి కూల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ కట్టడాన్ని నిర్మించడంతో కలెక్టర్ సమక్షంలో ఈ కూల్చివేతను పూర్తి చేశారు.

