Tirumala: తిరుమలకు వచ్చి కన్నుమూసిన తల్లి... ఈ పిల్లలు ఎవరో తెలిస్తే చెప్పాలంటున్న పోలీసులు!

  • తిరుమలకు ఇద్దరు బిడ్డలతో వచ్చిన మహిళ
  • కల్యాణకట్ట వద్ద స్పృహలేకుండా చూసి ఆసుపత్రికి తరలింపు
  • వివరాలు చెప్పలేకపోతున్న బిడ్డలు
  • 0877 2289027 నంబరుకు చెప్పాలంటున్న పోలీసులు

తన బిడ్డలతో తిరుమలకు వచ్చిన ఓ తల్లి, తీవ్ర అస్వస్థతకు గురై బిడ్డలిద్దరినీ అనాధలుగా మిగిల్చి ప్రాణాలు వదిలింది. తమ పేర్లు, తల్లి పేరు మాత్రమే చెబుతున్న బిడ్డలు, మిగతా వివరాలు వెల్లడించలేక పోతుండటంతో, వారి ఫోటోలను విడుదల చేస్తూ, వీరు ఎవరో తెలిస్తే చెప్పాలని తిరుపతి పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, ఒకటో తేదీన, తిరుమలలోని కల్యాణకట్ట వద్ద దాదాపు 35 ఏళ్ల వయసుండే ఓ మహిళ కదలకుండా పడివుండటం, పక్కనే ఇద్దరు చిన్నారులు ఏడుస్తూ ఉండటంతో, సమీపంలోని దుకాణదారులు విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో తొలుత ఆమెను ఆశ్విని ఆసుపత్రికి, ఆపై తిరుపతిలోని రూయా ఆసుపత్రికి తరలించినా, ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతున్న ఆమె నిన్న కన్నుమూసింది.

తమ పేర్లు మనోజ్‌, కార్తీక అని, అమ్మ పేరు గీత అని మాత్రమే పిల్లలు చెప్పడంతో, గుర్తుతెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి, పిల్లలిద్దరినీ చైల్డ్‌ వెల్‌ ఫేర్‌ కేంద్రానికి పంపారు. వీరి వివరాలు తెలిస్తే, 0877 2289027 నెంబరులో తెలియజేయాలని పోలీసులు కోరారు.

Tirumala
Tirupati
Lady
Died
Son
Daughter
  • Loading...

More Telugu News