Krishna District: ఉదయాన్నే జగన్ ఇంటికి వచ్చి పార్టీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థన్‌!

  • లోటస్ పాండ్ లో వైసీపీలో చేరిన బాలవర్ధన్
  • జగన్ ఏ పని చెప్పినా చేసేందుకు సిద్ధమని వెల్లడి
  • గన్నవరం ప్రాంతంలో పార్టీ పట్టు పెరిగిందన్న జగన్

కృష్ణా జిల్లా టీడీపీ నేత, గన్నవరం ప్రాంతంలో పట్టున్న నాయకుడు, విజా డెయిరీ డైరెక్టర్‌ దాసరి వెంకట బాలవర్థన్‌ రావు ఈ ఉదయం హైదరాబాద్, లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసానికి వచ్చి, ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. దాసరికి స్వయంగా కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన జగన్, ఆయన రాకతో గన్నవరం ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతమైందని అన్నారు.

ఈ సందర్భంగా బాలవర్ధన్ రావు మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలో ఇప్పుడు భయానక వాతావరణం నెలకొందని, ప్రజల కష్టసుఖాలు వినేవారే లేరని అన్నారు. తన కార్యకర్తలు, గన్నవరం ప్రజల మేలు కోసం వైసీపీలో చేరుతున్నానని, ఈ సందర్భంగా ఎటువంటి కోరికలనూ తాను కోరలేదని చెప్పారు. జగన్ ఆధ్వర్యంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఆయన ఏది చెబితే అది చేస్తానని అన్నారు. కాగా, దాసరి వెంట రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, బాలవర్థన్‌ రావు సోదరుడు దాసరి జై రమేష్‌ తదితరులు కూడా ఉన్నారు.

Krishna District
YSRCP
Gannavaram
Dasari Balavardhan
  • Loading...

More Telugu News