Tamil Nadu: కరుణానిధి మనవరాలికి నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ

  • ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయక పోవడంతో తంటా
  • కేసు పెట్టిన ఐటీ శాఖ అధికారులు
  • అరెస్టు వారెంటు జారీ చేసిన న్యాయస్థానం

తమిళ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వి అరెస్టుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడంతో ఐటీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కోర్టు కేసును పరిశీలించి నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంటు జారీ చేసింది.

కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కుమార్తె అయిన అంజుగ సెల్వి 2009-10 సంవత్సరానికి సంబంధించిన రిటర్స్‌ దాఖలు చేయలేదు. ఆమె దాదాపు 70 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉండడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు  పలుమార్లు నోటీసులు ఇచ్చారు. దేనికీ ఆమె స్పందించ లేదు సరికదా డబ్బు కూడా చెల్లించకపోవడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు కేసు పెట్టారు. కేసును విచారించిన కోర్టు అంజుగ సెల్వికి అరెస్టు వారెంటు జారీ చేసింది.

Tamil Nadu
algiri daughter
arrest warent
income tax
  • Loading...

More Telugu News