Andhra Pradesh: భీమిలి నుంచి లోకేశ్ పోటీపై చంద్రబాబు అభిప్రాయ సేకరణ!

  • 'విశాఖ' నియోజకవర్గాల సమీక్ష జరిపిన అధినేత
  • భీమిలి స్థానంపై ప్రత్యేక పరిశీలన
  • మంత్రి గంటాకు విశాఖ నార్త్!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్నికల ముంగిట అభ్యర్థుల ఎంపికలో తీరికలేని విధంగా తలమునకలయ్యారు. వరుసగా ఒక్కో జిల్లాలో టీడీపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు ఓ కొలిక్కి తెస్తున్న చంద్రబాబు తాజాగా విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించారు. అమరావతిలో గురువారం నాడు ఆయన టీడీపీ ముఖ్యనేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానంగా భీమిలి నియోజకవర్గంపై నేతల అభిప్రాయాలు సేకరించినట్టు సమాచారం. ఎందుకంటే, భీమిలి నుంచి మంత్రి నారా లోకేశ్ బరిలో దిగే విషయం దాదాపు తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది. భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు విశాఖ నార్త్ నియోజకవర్గం కేటాయించి, లోకేశ్ ను భీమిలి నుంచి బరిలో దించాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి అభిప్రాయ సేకరణతో సరిపెట్టిన చంద్రబాబు మరికొంత సమయం వేచిచూసి లోకేశ్ పోటీచేసే నియోజకవర్గాన్ని ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News