Andhra Pradesh: అశోక్-లోకేశ్ మంచి ఫ్రెండ్స్.. మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలి: టీఆర్ఎస్ నేత బాల్క సుమన్

  • అమరావతిలో పటిష్ట భద్రత మధ్య అశోక్ ను ఉంచారు!
  • ఒకప్పుడు లాడెన్ కు కూడా పాక్ అంత భద్రతనివ్వలేదు
  • మా కోపం చంద్రబాబుపైనే.. అక్కడి ప్రజలపై కాదు

ఏపీ ప్రజల సమాచారం చోరీకి గురైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్, మంత్రి నారా లోకేశ్ లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ఐటీ శాఖా మంత్రి అయిన లోకేశ్ రాజీనామా చేయాలని అన్నారు. అమరావతిలో పోలీసుల భద్రత మధ్య అశోక్ ను ఓ బిల్డింగ్ లో దాచిపెట్టారని ఆరోపించారు. ఒకప్పుడు పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాది బిన్ లాడెన్ కు కూడా పాక్ అంత భద్రత కల్పించలేదంటూ సెటైర్లు విసిరారు.

ఏపీ సీఎం చంద్రబాబుపై తమకు కోసం ఉంది కానీ, అక్కడి ప్రజలపై లేదని అన్నారు. తాము ఎవరిపైనా కక్ష గట్టలేదని, ఆంధ్రా ప్రజలకు తాము వ్యతిరేకం కాదని, ప్రాంతాలు విడిపోయినా ప్రజలు కలిసి ఉండాలన్నది తమ అభిమతమని చెప్పారు. విభజన వికాసానికే అన్న కాన్సెప్ట్ తమదని, మొదటి నుంచి చంద్రబాబుతో కేసీఆర్ సఖ్యతగానే ఉన్నారని, వక్రబుద్ధి ఉన్న బాబే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని బాల్క సుమన్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు.

Andhra Pradesh
Telangana
kcr
Chandrababu
TRS
balka suman
mla
Telugudesam
lokesh
  • Loading...

More Telugu News