Hyderabad: నొప్పి నివారణ మాత్రల మోతాదు మించడం వల్లే చిన్నారులకు అస్వస్థత: నీలోఫర్ ఆసుపత్రి
- నిన్న చిన్నారులకు టీకాలు వికటించిన ఘటన
- ‘నీలోఫర్’లో చికిత్స పొందుతున్న చిన్నారులు
- ఓ చిన్నారి మృతి.. ముగ్గురు చిన్నారులకు వెంటిలేటర్లు ఏర్పాటు
హైదరాబాద్ లోని నాంపల్లి అర్బన్ హెల్త్ సెంటర్ లో నిన్న టీకాలు వికటించిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో 21 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులకు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, చిన్నారులకు టీకాలు వేసిన తర్వాత నొప్పి నివారణకు ఇచ్చిన మాత్రల్లో పొరపాటు జరిగిందని, పారాసిటమాల్ కు బదులు ఇచ్చిన ట్రెమడాల్ మాత్రల మోతాదు ఎక్కువ కావడంతో వారు అస్వస్థతకు గురైనట్టు చెప్పారు. ముగ్గురు చిన్నారుల పరిస్థితి బాగుండలేదని, వారికి వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్టు సమాచారం.