manchu lakshmi: సమయాన్ని పాటించడం మాకు వారసత్వంగా వచ్చింది: మంచు లక్ష్మి

  • 'మిసెస్ సుబ్బలక్ష్మీ' వెబ్ సిరీస్ లో మంచు లక్ష్మి 
  • ఆమెతో కలిసి నటించే అవకాశం వచ్చింది
  •  మా ఇంట్లో అంతా సమయాన్ని పాటిస్తారు

'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్ తో మంచు లక్ష్మి డిజిటల్ మీడియాలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ లో 'చిత్రం' శీను కూడా నటించాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన మీడియా సమావేశంలో 'చిత్రం' శీను మాట్లాడుతూ, "ఇంతవరకూ నేను మంచు లక్ష్మి సినిమాల్లో చేయలేదు. ఆమెతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో నటించే అవకాశం లభించడం ఆనందంగా వుంది.

మంచు లక్ష్మి సమయపాలన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె కంటే ముందుగా నేను సెట్ కి రావాలనుకునేవాడిని. కానీ ప్రతిరోజు నేను సెట్ కి వచ్చేసరికి .. ఆమె సెట్లో ఉండేవారు .. ఏ రోజూ కూడా ఆమెకంటే ముందుగా నేను సెట్ కి రాలేకపోయాను" అని చెప్పాడు. అప్పుడు మంచు లక్ష్మి స్పందిస్తూ .."మొదటి నుంచి కూడా ఎక్కడికైనా సరే సమయానికి వెళ్లడం నాకు అలవాటు. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, అంతా సమయాన్ని తప్పకుండా పాటిస్తారు. అది మాకు వారసత్వంగా వచ్చింది" అని అన్నారు.

manchu lakshmi
chithram seenu
  • Loading...

More Telugu News