Andhra Pradesh: ఏపీ పోలీసులపై నమ్మకం లేని వ్యక్తి ఏపీ సీఎం కావాలనుకోవడం విడ్డూరం!: జగన్ పై కోడెల సెటైర్లు

  • మోదీ, కేసీఆర్ డైరెక్షన్ లోనే జగన్ మైండ్ గేమ్  
  • వైసీపీ నేతల చౌకబారు వ్యాఖ్యలపై స్పందించను
  • కుట్రతోనే ఏపీపై దాడులు చేస్తున్నారు

ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ పోలీసులపై నమ్మకం లేని జగన్, ఏపీ ముఖ్యమంత్రి కావాలనుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైసీపీ నేతలు ఆయనపై చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించగా.. చౌకబారు మాటలపై తాను స్పందించలేనని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డేటా చోరీ వ్యవహారంపై మాట్లాడుతూ, కుట్రతోనే ఏపీపై దాడులు చేస్తున్నారని, తెలంగాణ అధికారులు నాయకులను మించిన రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Andhra Pradesh
Telugudesam
speaker
kodela
jagan
  • Loading...

More Telugu News