pakistan: 180 మదర్సాలను నియంత్రణలోకి తీసుకున్నాం.. 121 మందిని అరెస్ట్ చేశాం: పాకిస్థాన్

  • నిషేధిత సంస్థలకు చెందిన వారిని అరెస్ట్ చేశాం
  • దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే ఈ చర్యలు
  • భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కారణంతో కాదు

టెర్రిరిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నామని పాకిస్థాన్ ప్రకటించింది. 182 మదర్సాలను నియంత్రణలోకి తీసుకున్నామని... నిషేధిత సంస్థలకు చెందిన 121 మందిని అరెస్ట్ చేశామని పాక్ ప్రభుత్వం ఈరోజు తెలిపింది. తమ దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగానే తాము ఇదంతా చేశామని... భారత్ ఆగ్రహం వ్యక్తం చేసిందన్న కారణంతో కాదని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించింది.

మదర్సాల విషయంలో ఏం చేయాలనేది పాకిస్థాన్ లో ఇప్పుడు ఒక సవాల్ గా పరిణమించింది. యువతలో రాడికల్ భావజాలాన్ని మదర్సాలు నింపుతున్నాయనే ఆరోపణలు ఇటీవలి కాలంలో ఆ దేశంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరోవైపు పేద దేశమైన పాక్ లో లక్షలాది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నది కూడా మదర్సాలే.

pakistan
madrassas
terrorists
  • Loading...

More Telugu News