kangana ranaut: తన ప్రియుడిని 'భాధ్యత లేని వ్యక్తి' అన్న కంగనా రనౌత్ వ్యాఖ్యలపై అలియా భట్ స్పందన

  • కంగన మాదిరి దాపరికాలు లేకుండా మాట్లాడలేను
  • ఆమె చెప్పింది నిజమే కావచ్చు
  • కంగన చాలా నిజాయతీగా మాట్లాడుతుంది

వివాదాలకు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్... ప్రస్తుత రాజకీయాలపై స్పందించడానికి నిరాకరించారు. దీనిపై తాజాగా కంగనా రనౌత్ మాట్లాడుతూ, రణబీర్ కపూర్ బాధ్యత లేని వ్యక్తి అంటూ విమర్శించింది. 'రణబీర్ కపూర్ లాంటి నటులకు సమాజం పట్ల బాధ్యత లేదు. వాళ్ల ఇంటికి కరెంట్, నీరు నిరాటంకంగా అందుబాటులో ఉంటాయి. లగ్జరీ ఇళ్లలో ఉంటూ, మెర్సిడెస్ బెంజ్ కార్లలో తిరుగుతారు. ఇదంతా దేశ ప్రజల వల్ల వచ్చిందే. కానీ, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మాత్రం ఇలాంటి వారు ఇష్టపడరు. నేను అలాంటి వ్యక్తిని కాదు' అని వ్యాఖ్యానించింది.

కంగన కామెంట్ పై రణబీర్ ప్రియురాలు, నటి అలియా భట్ ను మీడియా ప్రశ్నించగా... 'కంగన మాదిరి దాపరికాలు లేకుండా నేను మాట్లాడలేను. ఆమె వ్యాఖ్యలను గౌరవిస్తా. ఒక రకంగా ఆమె చెప్పింది నిజమే కావచ్చు అని వ్యాఖ్యానించింది. నిజాయతీగా ఆమె మాట్లాడే తీరు తనను ఆకట్టుకుంటుందని చెప్పింది. 

kangana ranaut
ranbir kapoor
alia bhatt
bollywood
  • Loading...

More Telugu News