Andhra Pradesh: ‘రైతుబంధు’ను చంద్రబాబు కాపీ కొట్టారు: టీఆర్ఎస్ నేత కేటీఆర్

  • మన పథకం కాపీ కొట్టి ‘అన్నదాత సుఖీభవ’ తెచ్చారు
  • రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు కేసీఆర్
  • సంక్షేమానికి కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగం

తెలంగాణలో ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని మన పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు కాపీ కొట్టారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ లో నిర్వహిస్తున్న టీఆర్ఎస్ సభలో ఆయన మాట్లాడుతూ, మన పథకాన్ని కాపీ కొట్టిన చంద్రబాబు, ఏపీలో ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. రైతుల గురించి పట్టించుకున్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణలో రైతుల బాగు కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకాన్ని ఈరోజున దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని ప్రస్తావించారు. సంక్షేమానికి కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగమని కొనియాడారు. ఢిల్లీ మెడలు వంచే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉండాలని, శాసించి సాధించుకోవాలే తప్ప, యాచించి కాదని అన్నారు.

Andhra Pradesh
Telangana
cm
Chandrababu
KTR
TRS
rythu bandhu
bjp
pm
modi
  • Loading...

More Telugu News