rajasekhar: విడుదలకి సిద్ధమైన రాజశేఖర్ 'అర్జున'

- రాజశేఖర్ నుంచి పొలిటికల్ డ్రామా
- సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
- ఈ నెల 15వ తేదీన విడుదల
రాజశేఖర్ కథానాయకుడిగా కన్మణి దర్శకత్వంలో 'అర్జున' సినిమా రూపొందింది. సీకే ఎంటర్టైన్మెంట్స్ .. హ్యాపీ మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరియమ్ జకారియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు కీలకమైన పాత్రను పోషించారు. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర.
