rajasekhar: విడుదలకి సిద్ధమైన రాజశేఖర్ 'అర్జున'

  • రాజశేఖర్ నుంచి పొలిటికల్ డ్రామా 
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
  • ఈ నెల 15వ తేదీన విడుదల    

రాజశేఖర్ కథానాయకుడిగా కన్మణి దర్శకత్వంలో 'అర్జున' సినిమా రూపొందింది. సీకే ఎంటర్టైన్మెంట్స్ .. హ్యాపీ మూవీస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. మరియమ్ జకారియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో, కోట శ్రీనివాసరావు కీలకమైన పాత్రను పోషించారు. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన ఈ సినిమాలో రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేశారు. ఒకటి యువకుడి పాత్ర అయితే .. మరొకటి కాస్త వయసు పైబడిన పాత్ర. ఇలా రెండు విభిన్నమైన లుక్స్ తో ఆయన కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ద్విపాత్రాభినయం చేయడం రాజశేఖర్ కి కొత్తేమి కాదు .. గతంలో ఆయన రెండు పాత్రలు చేసిన సినిమాలు వున్నాయి. పెద్దగా హడావిడి లేకుండా వస్తోన్న ఈ సినిమా, ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

  • Loading...

More Telugu News