prabhas: రికార్డులు సృష్టిస్తోన్న 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2'

- షూటింగు దశలో 'సాహో'
- మేకింగ్ వీడియోకి భారీ రెస్పాన్స్
- ఆగస్టు 15వ తేదీన విడుదల
ప్రభాస్ తాజా చిత్రంగా .. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఇటీవల శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2' పేరుతో మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోకి వస్తోన్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.
