Hyderabad: నాంపల్లి అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో వికటించిన వ్యాక్సిన్‌

  • 15 మంది చిన్నారులకు అస్వస్థత
  • బాధితులు నీలోఫర్‌ ఆసుపత్రికి తరలింపు
  • అటువంటి దేమీ లేదంటున్న అధికారులు

పిల్లలకు వేసిన వ్యాక్సిన్‌ వికటించడంతో 15 మంది అస్వస్థులయ్యారు. దీంతో బాధితులందరినీ హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్‌ నాంపల్లిలోని అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం అదేం లేదని కొట్టిపారేస్తున్నాయి.

వ్యాక్సిన్‌ వేసిన వెంటనే నొప్పి రాకుండా వేయాల్సిన మందులను వేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, అస్వస్థులైన చిన్నారుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. బాధితులను నీలోఫర్‌ ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న హైదరాబాద్‌ డీఎంహెచ్‌ఓ, ఇతర వైద్యశాఖ అధికారులు హుటాహుటిన చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారులంతా ఒకటిన్నర ఏళ్లులోపు వయసువారేనని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

Hyderabad
nampalli urban health centre
vacsine
chaild
  • Loading...

More Telugu News