Parwej Musharraf: ఐఎస్ఐ, జైషే ఉగ్రబంధంపై ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు!

  • ఇండియాపై దాడులు చేయించింది నిజమే
  • అదే జైషే నన్ను చంపేందుకూ ప్రయత్నించింది
  • ప్రత్యేక ఇంటర్వ్యూలో పర్వేజ్ ముషారఫ్

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఇంటలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ, జైషే మహమ్మద్ ను వాడుకుంటూ, ఇండియాపై దాడులు చేయించిందని ఆయన అన్నారు. పాక్ కు చెందిన జర్నలిస్ట్‌ నదిమ్‌ మాలిక్‌ కు టెలిఫోన్ లో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, తన హయాంలో ఐఎస్ఐ, జైషే మహమ్మద్ తోనే దాడులు చేయించిందని, ఆ సమయంలో జైషే తనపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడి విఫలమైందని అన్నారు.

ఇదే సమయంలో అటువంటి ఉగ్ర సంస్థలపై మీ పాలనలో ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా, నాటి పరిస్థితులు చాలా భిన్నమైనవని, అప్పట్లో ఇండియా, పాకిస్థాన్ లు రహస్యంగా పోరాడుతుండేవని అన్నారు. జైషేపై చర్యలు తీసుకోవాలని తాను కూడా ఎటువంటి ఒత్తిడిని తీసుకు రాలేదని చెప్పారు. ముషారఫ్ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, జైషే మొహమ్మద్ నేత మసూద్ అజర్ ప్రోద్బలంతో గత నెలలో పుల్వామాలో సైనిక పటాలంపై ఆత్మాహుతి దాడి జరుగగా, 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

Parwej Musharraf
Pakistan
ISI
Jaishey Mohammad
  • Loading...

More Telugu News