Pakistan: సరిహద్దులో 30 ఏళ్ల పాక్‌ జాతీయుడి అరెస్టు

  • భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తుండగా పట్టుకున్న బీఎస్‌ఎఫ్‌ జవాన్లు
  • గుజరాత్‌లోని రణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద అదుపులోకి
  • సింధు ప్రావిన్స్‌ ఉమర్‌ కోట్‌ జిల్లా వాసిగా గుర్తింపు

బోర్డర్‌ సెక్యూరిటీ పోలీసులు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్న ఓ పాకిస్థాన్‌ జాతీయుడిని అరెస్టు చేశారు. గుజరాత్‌ రాష్ట్రం రణ్‌ ఆఫ్‌ కచ్‌ వద్ద ఓ 30 ఏళ్ల వ్యక్తి సరిహద్దు దాటుతుండగా గమనించిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు అతనిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 2.40 గంటల సమయంలో ఇతను భారత్‌ భూభాగంలోకి అడుగు పెడుతుండగా గస్తీ జవాన్లు పట్టుకున్నారు.

భద్రతా దళాలు చుట్టుముట్టగానే అతను లొంగిపోయాడని తెలిపారు. విచారించగా అతను పాకిస్థాన్‌ జాతీయుడని తేలింది. సింధు ప్రావిన్స్‌ ఉమర్‌కోట్‌ జిల్లా వాసి అని, పేరు మనహార్‌ సోటా అని గుర్తించారు. అయితే అతని వద్ద ఎటువంటి మారణాయుధాలు లేవని, విచారణ కోసం స్థానిక పోలీసులకు అప్పగిస్తామని బీఎస్‌ఎఫ్‌ అధికారులు తెలిపారు.

Pakistan
border security force
one arrest
  • Loading...

More Telugu News