Anantapur District: చంద్రబాబు వద్ద తమ డిమాండ్ ను నెగ్గించుకున్న జేసీ సోదరులు

  • వారసుల కోసం తమ స్థానాలను వదులుకున్న జేసీ సోదరులు
  • తాడిపత్రి స్థానాన్ని ప్రభాకర్ రెడ్డి కుమారుడికి కేటాయించిన చంద్రబాబు
  • అనంతపురం ఎంపీ స్థానానికి పవన్ కుమార్ రెడ్డి పేరు ఖరారు

అనంతపురం జిల్లా రాజకీయాలలో తమదైన ముద్ర వేసిన జేసీ సోదరులు దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కానున్నారు. తమ వారసుల భవిష్యత్తు కోసం తమ స్థానాలను వదులుకున్నారు. తమ స్థానంలో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని ముందు నుంచి కోరుతున్న జేసీ సోదరులు... చివరకు తమ డిమాండ్ ను సాధించుకున్నారు. వారి కోరిక మేరకు తాడిపత్రి ఎమ్మెల్యే స్థానాన్ని ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి, అనంతపురం ఎంపీ టికెట్ ను దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి చంద్రబాబు కేటాయించారు. జిల్లా సమీక్షలో భాగంగా అస్మిత్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డిలను చంద్రబాబు తన వద్దకు పిలిపించుకున్నారు. వారి భుజాలపై చేతులు వేసి, ప్రోత్సహించారు.

Anantapur District
jc diwakar reddy
jc prabhakar reddy
asmith reddy
pawan kumar reddy
Telugudesam
Chandrababu
tickets
  • Loading...

More Telugu News