preethi Reddy: ఇటీవలే గురుకుంట వచ్చి వెళ్లిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి.. గ్రామంలో విషాద ఛాయలు

  • 1995లో ఆస్ట్రేలియా వెళ్లిన ప్రీతిరెడ్డి కుటుంబం
  • ఇటీవల గ్రామంలో జరిగిన ఓ పెళ్లికి హాజరు
  • అంతలోనే దారుణ వార్త

ఆస్ట్రేలియా ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైనట్టు భావిస్తున్న దంత వైద్యురాలు ప్రీతిరెడ్డి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం గురుకుంట గ్రామం. ప్రీతిరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిన గ్రామస్థులు నివ్వెరపోయారు.

గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి-సుచరిత దంపతుల పెద్ద కుమార్తె ప్రీతిరెడ్డి. గ్రామంలో వీరి కుటుంబానికి మంచి పేరుంది. ఓ చిన్న పల్లెటూరు నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన ప్రీతిరెడ్డి అంటే అందరికీ గౌరవం. ఆమె చాలా మంచి అమ్మాయని, ఇటీవలే ఓ పెళ్లికి వచ్చి వెళ్లిందని గ్రామస్థులు తెలిపారు. అంతలోనే ఇలాంటి దారుణ వార్త వినాల్సి వస్తుందనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శాస్త్రవేత్తగా పనిచేసిన నర్సింహారెడ్డి ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య, ఇద్దరు కుమార్తెలు ప్రీతిరెడ్డి, నిత్యారెడ్డిలతో 1995లో ఆస్ట్రేలియాకు వెళ్లి  స్థిరపడ్డారు. ప్రస్తుతం సిడ్నీలోనే శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ప్రీతిరెడ్డి హత్య వార్త తెలిసి గురుకుంటలోని ఆమె చినతాత జగదీశ్వర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లోని ఆమె చిన్నాన్న యాదగిరి రెడ్డి, హైదరాబాద్‌లో ఉంటున్న మరో చిన్నాన్న దామోదర్ రెడ్డి కుటుంబాలు  విషాదంలో మునిగిపోయాయి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News