Andhra Pradesh: డేటా చోరీ కేసు: తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు

  • గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు
  • రెండు దశాబ్దాల టీడీపీ డేటాను తస్కరించారు
  • వైసీపీ నేతలు, తెలంగాణ సీనియర్ పోలీసులు కలిసి చోరీకి పాల్పడ్డారని ఫిర్యాదు

ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసు విషయమై తెలంగాణ పోలీసులపై ఏపీ టీడీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు టీడీపీ నేతలు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, కనకమేడల రవీంద్ర కుమార్ తదితర నేతలు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతలు, తెలంగాణ సీనియర్ పోలీసులు కలిసి టీడీపీ డేటా చోరీ చేశారని, రెండు దశాబ్దాల నుంచి టీడీపీ సేకరించిన డేటాను తస్కరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. గత నెల 23న ఐటీ గ్రిడ్ సంస్థపై పోలీసులు దాడి చేశారని, వైసీపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేందుకు వీలుగా తెలంగాణ పోలీసులు సహకరించారని, సీఈఓ అశోక్, సిబ్బందిని బెదిరించి బలవంతంగా సమాచారాన్ని డౌన్ లోడ్ చేసుకుని వెళ్లారని టీడీపీ నేతలు ఆ ఫిర్యాదులో ఆరోపించారు. సెక్షన్ 120 బీ, 418, 420, 380, 409, 167, 177.. తదితర సెక్షన్ల కింద తెలంగాణ పోలీసులపై కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు కోరారు.

  • Loading...

More Telugu News