Uttar Pradesh: చెప్పులతో కొట్టుకుని.. పిడిగుద్దులు కురిపించుకున్న యూపీ బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే

  • సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ది కమిటీ సమావేశం
  • హాజరైన ఎంపీ శరద్ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేశ్ సింగ్
  • ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం
  • మొత్తం ఘటనపై బీజేపీ సీరియస్

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే చెప్పులతో తన్నుకుని సంచలనం రేపారు. శంకుస్థాపన ఫలకంపై తలెత్తిన వివాదం చెప్పులతో కొట్టుకునే వరకూ వెళ్లింది. నేడు రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి, ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ హాజరయ్యారు. శంకుస్థాపన ఫలకంపై పేర్ల విషయంలో ప్రోటోకాల్ పాటించలేదంటూ ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదం ప్రారంభమైంది.

అది కాస్తా తీవ్రమై ఆగ్రహావేశాలతో చెప్పులతో కొట్టుకుని.. పిడిగుద్దులు కురిపించుకునే వరకూ వెళ్లింది. అక్కడ ఉన్న నేతలు, అధికారులు కూడా వారిని శాంతింప చేయలేక పోయారు. సమాచారం అందుకున్న పోలీసు అధికారులు వచ్చి ఇద్దరినీ శాంతింపజేశారు. ఎంపీపై చర్య తీసుకోవాలంటూ ఎమ్మెల్యే మద్దతుదారులు ఆందోళన నిర్వహించారు. ఈ మొత్తం ఘటనపై యూపీ బీజేపీ సీరియస్ అయింది. ఇద్దరు నేతలపై కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక జారీ చేసింది.

Uttar Pradesh
Sharad Tripathi
Rakesh Singh
Protocal
Santh Kabir nagar
  • Loading...

More Telugu News