Hyderabad: హైద‌రాబాద్‌లో మా డేటా చోరీ చేశారు.. జ‌గ‌న్‌కు అందించారు: నారా లోకేశ్

  • ఇది నేరం కాదా?
  • మా కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ ప్ర‌లోభాల‌కు గురి చేస్తోంది
  • ఇది చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ కింద‌కు రాదా?

హైదరాబాద్ లో జరిగిన డేటా చోరీ వ్యవహారంపై తెలంగాణ, ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలు పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ వరుస ట్వీట్లు చేశారు. ‘హైద‌రాబాద్‌లో మా డేటా చోరీ చేశారు. ఇది నేరం కాదా? హైద‌రాబాద్‌లోనే దీనిని జ‌గ‌న్‌కు అందించారు. ఇది అప్ర‌జాస్వామికం కాదా? హైద‌రాబాద్ వైకాపా కాల్ సెంట‌ర్ నుంచే ఏపీలోని టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప్ర‌లోభాల‌కు గురి చేసే కాల్స్ చేస్తున్నారు. ఇది చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ కింద‌కు రాదా? ఇన్ని అక్ర‌మాలు హైద‌రాబాద్‌లోనే జ‌రుగుతున్నాయి. మరి దీనిపై టీఎస్ ప్రభుత్వం యాక్షన్ తీసుకోదా? జగన్, కేటీఆర్ జోడి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?’ అని లోకేశ్ ప్రశ్నించారు.


Hyderabad
data
TRS
Telugudesam
YSRCP
jagan
Nara Lokesh
kalva kuntla
KTR
  • Loading...

More Telugu News