Telangana: టీఆర్ఎస్ ను 16 ఎంపీ స్థానాల్లో గెలిపించండి.. దేశ ప్రధానిని కేసీఆర్ నిర్ణయిస్తారు: కేటీఆర్

  • మా ఎంపీలకు తోడుగా మరో 70 మంది తోడవుతారు
  • దేశాన్ని మోదీ ఉద్ధరిస్తారని అందరూ భ్రమపడ్డారు
  • మోదీ, రాహుల్ లిద్దరూ దొందూ దొందే 

తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను 16 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే, దేశ ప్రధాని ఎవరన్న విషయాన్ని కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ నిర్ణయిస్తుందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఎంపీలకు తోడుగా మరో 70 మంది ఎంపీలు తోడవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ దేశాన్ని ఉద్ధరిస్తారని అందరూ భ్రమపడ్డారు కానీ, దేశం ముందుకు పోదన్న విషయం అర్థమైందని అన్నారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ లిద్దరూ దొందూ దొందేనన్న విషయం ప్రజలకు బాగా తెలుసని వ్యంగ్యంగా అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పైసా కూడా ఇవ్వలేదని, ‘కేంద్రంలో బడితె ఉన్నోడిదే బర్రె అయింది’ అని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో తన అత్తగారి ఊరి దాకా రైలు వేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. 

  • Loading...

More Telugu News