Jagan: మేనిఫెస్టో కమిటీతో జగన్ కీలక భేటీ!

  • మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు
  • మేనిఫెస్టోపై దృష్టి సారించిన జగన్
  • జిల్లాల పర్యటనల తరువాత కమిటీతో భేటీ

మరో రెండు మూడు నెలల్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు రానున్నందున, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, మేనిఫెస్టోపై ప్రత్యేక దృష్టిని సారించారు. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి నవరత్నాలను ప్రకటించిన జగన్, నేడు లోటస్ పాండ్ లో మరో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరుకాగా, ఇంకేమైనా ప్రజలకు హామీలు ఇవ్వాలా? అన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

వైసీపీ మేనిఫెస్టో కమిటీలో 31మంది సభ్యులుండగా, పార్టీ సీనియర్‌ నేత ఉమ్మారెడ్డి అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిటీ ఇటీవల జిల్లాల పర్యటనలు జరిపి, కార్యకర్తలు, ప్రజలతో సమావేశమై, వారి కోరికలను తెలుసుకుంది. ఆయా వివరాలను నేడు జగన్ తో పంచుకోగా, కమిటీ ప్రతిపాదించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.

  • Loading...

More Telugu News