vangaveeti: లగడపాటితో వంగవీటి రాధా భేటీ.. జగన్ ఓటమే నా లక్ష్యమన్న రాధా

  • జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా
  • చంద్రబాబు తరపున టీడీపీ నేతలు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు
  • అనుచరులు, సన్నిహితుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటా

మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ నిన్న సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్ ఓటమే తన లక్ష్యమని చెప్పారు. జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తెలిపారు. మరోవైపు, టీడీపీలో రాధా చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆయన లగడపాటితో భేటీ అయినట్టు సమాచారం. తనను, తన తండ్రి రంగాను అవమానపరిచేలా జగన్ వ్యవహరించారని రాధా మధనపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తరపున టీడీపీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని... తన అనుచరులు, సన్నిహితులతో చర్చించి, వారి అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటానని ఈ సందర్భంగా రాధా చెప్పారు.

vangaveeti
radha
lagadapati
Telugudesam
Chandrababu
jagan
ysrcp
  • Loading...

More Telugu News