Preeti Reddy: ఆస్ట్రేలియాలో అదృశ్యమైన డాక్టర్ ప్రీతిరెడ్డి... మూడు రోజుల తరువాత సొంత కారులోనే మృతదేహం!

  • ఆదివారం నుంచి కనిపించని ప్రీతిరెడ్డి
  • మాజీ ప్రియుడే హత్య చేసుంటాడని అనుమానం
  • కేసును విచారిస్తున్న పోలీసులు

ఆస్ట్రేలియాలో గత ఆదివారం నుంచి అదృశ్యమైన హైదరాబాద్ డెంటల్ డాక్టర్ ప్రీతి రెడ్డి, తన కారులోనే విగతజీవిగా కనిపించింది. ఆమె వయసు 32 సంవత్సరాలు. సిడ్నీలో మూడు రోజుల క్రితం ఆమె అదృశ్యమైనట్టు కేసు నమోదైంది. కేసును విచారిస్తున్న క్రమంలో ఆమె కారులోనే ఉన్న సూట్ కేసులో ముక్కలుగా నరికివేయబడి కుక్కిన స్థితిలో ప్రీతిరెడ్డి మృతదేహం కనిపించింది. ప్రీతిరెడ్డి మాజీ ప్రియుడు హర్షవర్ధన్ ఆమెను హత్య చేసివుండవచ్చన్న కోణంలో పోలీసులు కేసును విచారిస్తున్నారు. సిడ్నీలోని ఓ రెస్టారెంట్ వద్ద ప్రీతి చివరిసారిగా కనిపించినట్టు తెలుస్తోంది. ఆపై టిఫిన్ చేసి వస్తానని చెప్పిన ఆమె రాకపోవడంతో కేసు నమోదైంది.

Preeti Reddy
Australia
Sydney
Dental Doctor
  • Loading...

More Telugu News