kaushal: కౌశల్ తీరును దుయ్యబడుతూ కౌశల్ ఆర్మీ తిరుగుబాటు సాంగ్

  • కౌశల్ ఆర్మీ ఆరోపణలు
  • ఖండిస్తూ వస్తోన్న కౌశల్
  •  ఏకంగా సాంగ్ రిలీజ్      

కొన్ని రోజులుగా కౌశల్ కి .. కౌశల్ ఆర్మీకి మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. కౌశల్ ఆర్మీ తరఫున సేవా కార్యక్రమాలను అందించడం కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా కౌశల్ చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కౌశల్ ఆర్మీ మాటలతో దాడి చేయడమే కాకుండా .. కౌశల్ తీరును తప్పుబడుతూ ఒక పాటను కూడా రిలీజ్ చేశారు.

"అందరూ గొర్రెలే .. " అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నై కి చెందిన అరవింద్ అనే వ్యక్తి ఈ పాటను విడుదల చేశాడు. కౌశల్ ఆర్మీ పేరుతో తామంతా భజనలు చేసి .. గొర్రెలం అయ్యాము అనే అర్థంలో ఈ పాట వుంది. 'అన్న అనుకుంటే పీఎమ్ కాల్ వస్తది .. సీఎం సీటు వస్తది .. టెన్త్ పాస్ కాకున్నా డాక్టరేట్ వస్తది' అనే వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ రాసిన ఈ పాటపై కౌశల్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి. 

  • Loading...

More Telugu News