Rammohan Naidu: ఏపీ ప్రజల కోరికలకు భిన్నంగా వింత ప్రకటనలు చేస్తున్నారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • ఉత్తరాంధ్ర ప్రజలను అపహాస్యం చేస్తున్నారు
  • జగన్ కూడా వంత పాడుతున్నారు
  • మోదీ మరోసారి మోసం చేశారు

జిల్లాలోని అన్ని స్టేషన్లనూ విశాఖ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురావాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. నేడు ఆయన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌లో ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయంపై రామ్మోహన్ నాయుడు దీక్ష చేపట్టారు. దీనికి ముందు టీడీపీ నిర్వహించిన భారీ ద్విచక్ర వాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద నేటి సాయంత్రం వాల్తేర్ డివిజన్ సాధన దీక్ష ప్రారంభమైంది.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. వాల్తేరు డివిజన్‌ను తీసేసి విశాఖ జోన్ ప్రకటించడమంటే ఉత్తరాంధ్ర ప్రజలను అపహాస్యం చేయడమేనన్నారు. రైల్వే జోన్ విషయంలో ప్రధాని మోదీ మరోసారి మోసం చేశారన్నారు. విశాఖ జోన్ విషయంలో జగన్ కూడా వంత పాడుతున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. ఏపీ ప్రజలు కోరికలకు భిన్నంగా మోదీ వింత ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ దీక్షలో టీడీపీ ఎమ్మెల్యేలు కలమట వెంకట రమణ, బెందాళం అశోక్ పాల్గొన్నారు.

Rammohan Naidu
Srikakulam MP
Visakha Railway Zone
Narendra Modi
Jagan
Venkata Ramana
  • Loading...

More Telugu News