Andhra Pradesh: ఐరిస్, వేలిముద్రలు లేకుండా ఆధార్ డేటా బయటకు రాదు: ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు

  • పీపుల్స్ హబ్ నుంచి సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు
  • దీని ద్వారా 30 పథకాలను అమలు చేస్తున్నాం
  •   ఈ డేటా ఆధారంగానే ‘అన్నదాత సుఖీభవ’ అమలు

ఐరిస్, వేలిముద్రలు లేకుండా ఆధార్ డేటా బయటకు రాదని ఆర్టీజీఎస్ సీఈవో అహ్మద్ బాబు స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పీపుల్స్ హబ్ నుంచి సంక్షేమ పథకాల అర్హులను గుర్తిస్తామని, దీని ద్వారా 30 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుకు కూడా దీని నుంచి సేకరించిన డేటానే ఉపయోగించామని అన్నారు. కేంద్ర పెట్టుబడి సాయం పథకం లబ్ధిదారుల ఎంపిక కూడా ఈ డేటా ఆధారంగానే అమలవుతుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Andhra Pradesh
amaravathi
aadhar
rtgs
ceo
  • Loading...

More Telugu News