Modugula Venugopal Reddy: టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే మోదుగుల.. కాసేపట్లో జగన్‌తో భేటీ!

  • చంద్రబాబుకు రాజీనామా లేఖ
  • వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా
  • గుంటూరు నుంచి వైసీపీ తరుపున పోటీ

టీడీపీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీని వీడారు. ఈ మేరకు నేటి సాయంత్రం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు తన రాజీనామా లేఖను పంపించారు. తన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నట్టు మోదుగుల లేఖలో పేర్కొన్నారు.

కొన్ని రోజులుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మోదుగుల.. నేటి ఉదయం అనుచరులతో భేటీ అనంతరం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. అయితే కొద్దిసేపట్లో మోదుగుల.. వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. వైసీపీ నుంచి మోదుగుల నరసరావుపేట లేదా గుంటూరు నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

Modugula Venugopal Reddy
Telugudesam
Chandrababu
Jagan
YSRCP
Guntur
  • Loading...

More Telugu News