Congress: అకాలీదళ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో చేరిక!

  • నిన్న కాంగ్రెస్‌లో చేరిన సావిత్రి బాయి
  • నేడు కాంగ్రెస్‌లో చేరిన షేర్ సింగ్
  • ఫిరోజ్‌పూర్‌లో బలమైన అభ్యర్థిగా ఉన్న షేర్‌ సింగ్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నిన్న యూపీకి చెందిన బీజేపీ ఎంపీ సావిత్రి బాయి పూలే కాంగ్రెస్ పార్టీలో చేరగా.. నేడు పంజాబ్ కు చెందిన ఎంపీ షేర్ సింగ్ గుభయా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న శిరోమణి అకాలీదళ్‌కు రాజీనామా చేసిన ఆయన నేడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఫిరోజ్‌పూర్ లోక్‌సభ స్థానంలో షేర్ సింగ్‌కు బలమైన అభ్యర్థిగా పేరుంది. ఈ కార్యక్రమంలో రాహుల్‌తో పాటు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సునీల్ కుమార్ జఖార్, పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆశా కుమారి తదితరులు పాల్గొన్నారు.

Congress
Savitri Bai
Share Singh
Siromani Akalidal
Phirojpur
Rahul Gandhi
sunil Kumar
  • Loading...

More Telugu News